జిల్లాకో సైకో సూదిగాళ్లను తయారు చేశారు.. | roja takes on tdp leaders | Sakshi
Sakshi News home page

జిల్లాకో సైకో సూదిగాళ్లను తయారు చేశారు..

Sep 16 2015 11:11 AM | Updated on Aug 10 2018 9:42 PM

జిల్లాకో సైకో సూదిగాళ్లను తయారు చేశారు.. - Sakshi

జిల్లాకో సైకో సూదిగాళ్లను తయారు చేశారు..

ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ నాయకులు అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు.

అనంతపురం : ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ నాయకులు అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. టీడీపీ ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమనాయుడు, మంత్రి కె.అచ్చెన్నాయుడు సైకోలుగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. జిల్లాకో సైకో సూదిగాళ్లను చంద్రబాబు నాయుడు తయారు చేస్తున్నారని రోజా మండిపడ్డారు.  ఆంధ్రప్రదేశ్లో చంద్రన్న అరాచకపాలన సాగుతోందని మండిపడ్డారు.

దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ఆర్ అభిమాని సూరయ్యను చంపిన పయ్యావుల సోదరులు ... వారి భూములను లాక్కోవడం దారుణమన్నారు. సూరయ్య కుటుంబాన్ని చూసి ఎందుకు వణికిపోతున్నారంటూ రోజా... పయ్యావుల సోదరులను సూటిగా ప్రశ్నించారు. ధర్నా చేసే నైతిక హక్కు వైఎస్ఆర్ సీసీకి లేదా అని ఆ పార్టీ నేతలను నిలదీశారు. రాష్ట్రంలో మహిళలను వేధించడమే లక్ష్యంగా టీడీపీ నేతలు పని చేస్తున్నారని రోజా విమర్శించారు. మహిళలను వేధించిన అందరికీ ఎమ్మెల్సీలుగా ప్రమోషన్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement