కొత్త నోట్ల ప్రింటింగ్‌ ఖర్చుఎంతో తెలుసా? | Revealed: The Cost Of Printing New 500, 2,000 Rupee Notes | Sakshi
Sakshi News home page

కొత్త నోట్ల ప్రింటింగ్‌ ఖర్చుఎంతో తెలుసా?

Mar 15 2017 8:26 PM | Updated on Sep 5 2017 6:10 AM

కొత్త నోట్ల ప్రింటింగ్‌  ఖర్చుఎంతో తెలుసా?

కొత్త నోట్ల ప్రింటింగ్‌ ఖర్చుఎంతో తెలుసా?

కొత్తగా చెలామణిలోకి తీసుకొచ్చిన రూ.500, రూ.2000 నోట్లను ముద్రణ ఖర్చు వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలియ చేశారు.

న్యూడిల్లీ:  నవంబర్‌ 9 న పెద్దమొత్తంలోచలామణిలోవున్న రూ. 500, 1000 నోట్లను రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం ముద్రించిన కొత్త నోట్ల విలువ ఎంతో తెలుసా?   ఈ వివరాలను ఆర్థిక శాఖ బుధవారం వెల్లడించింది.  కొత్తగా  చెలామణిలోకి తీసుకొచ్చిన రూ.500, రూ.2000 నోట్లను ముద్రణ ఖర్చు వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలియ చేశారు.  రాజ్యసభలో లిఖిత పూర్వకంగా ఈ  వివరాలను ఆయన వెల్లడించారు.
 
 రూ.500 నోటు ప్రింట్ చేసేందుకు రూ.2.87 నుంచి రూ.3.09,  రూ.2000 నోటు ముద్రణకు రూ.3.54 నుంచి రూ.3.77 మేర వెచ్చిస్తున్నట్లు రాజ్యసభలో మేఘవాల్ తెలిపారు. కొత్త నోట్ల ప్రింటింగ్ ఇంకా కొనసాగుతున్నకారణంగా పూర్తి ఖర్చు వివరాలను ఇప్పుడే చెప్పలేమన్నారు.  కొత్త కరెన్సీ నోట్లను ముద్రించే  పేపర్‌ ను  కొనుగోలు రిజర్వు బ్యాంకు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. నిర్దిష్ట  సరఫరాదారులకు తప్ప ఇతరులు అనుమతి లేదని,  ఈ వివరాలను ఎవరికీ అందించలేమన్నారు.అ లాగే "రహస్యంగా మరియు ప్రత్యేకంగా" అనే నిబంధన ఒప్పందంలో చేర్చినట్టు మంత్రి తెలిపారు.

 
అలాగే ఫిబ్రవరి 24, 2017 నాటికి దేశంలో రూ. 11.64 లక్షల కోట్ల కరెన్సీ చెలామణీలో ఉన్నట్టు వెల్లడించారు.  2016 డిసెంబర్ 10 నాటికి బ్యాంకుల్లో  డిపాజిట్‌ అయిన పాత రూ.500, రూ.1000 నోట్లు కరెన్సీ విలువ సుమారు రూ.12.44 లక్షల కోట్లు అని.. దీనిపై ఇంకా   పరిశాలన జరుగుతోందని చెప్పారు.
 
కాగా  ప్రస్తుతం ఏటీఎం లు సరిగా పనిచేయకపోవడం,  కొత్త నోట్ల కొరత కొనసాగుతుండడం పై కూడా  ప్రశ్నలు చెలరేగాయి. అయితేదీనిపై స్పందించిన ఆయన. దేశవ్యాప్తంగా 2.18 లక్షల ఏటీఎంలు ఉండగా.. ఈ ఏడాది జనవరి 4 నాటికి 1.98 లక్షల ఏటీఎంల పునరుద్ధరణ జరిగినట్లు  సమాధానమిచ్చారు. కొత్త నోట్ల కొరత త్వరలోనే పూర్తిగా తీరిపోనుందని అర్జున్ రామ్  సభలో హామీ ఇవ్వడం విశేషం.


 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement