రిలయన్స్ లైఫ్ నుంచి సూపర్ మనీ బ్యాక్ ప్లాన్ | reliance life to super money back plan | Sakshi
Sakshi News home page

రిలయన్స్ లైఫ్ నుంచి సూపర్ మనీ బ్యాక్ ప్లాన్

Jan 28 2014 12:40 AM | Updated on Sep 2 2017 3:04 AM

రిలయన్స్ లైఫ్ నుంచి సూపర్ మనీ బ్యాక్ ప్లాన్

రిలయన్స్ లైఫ్ నుంచి సూపర్ మనీ బ్యాక్ ప్లాన్

రిలయన్స్ క్యాపిటల్‌కు చెందిన రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ కొత్తగా రిలయన్స్ సూపర్ మనీ బ్యాక్ ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది.

 హైదరాబాద్: రిలయన్స్ క్యాపిటల్‌కు చెందిన రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ కొత్తగా రిలయన్స్ సూపర్ మనీ బ్యాక్ ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్‌లో లైఫ్ కవర్ ఎన్నేళ్లు ఉంటుందో, దాంట్లో సగం కాలానికి ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని కంపెనీ  సీఈవో అనుప్ రావూ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ ఐదేళ్లకు మనీ బ్యాక్ ప్రయోజనాలుంటాయని పేర్కొన్నారు. ప్రీమియం చెల్లింపు కాలం పూర్తయిన తర్వాత పాలసీదారుడు క్రమం తప్పకుండా నెలవారీ ఆదాయం పొందవచ్చని వివరించారు. ఈ నెల వారీ చెల్లింపు ప్రతీ ఏడాది 3% చొప్పున వృద్ధి చెందుతుందని, మెచ్యురిటీ కాలం వరకూ/పాలసీదారుడు జీవించి ఉన్నంత వరకూ  ఈ చెల్లింపులు కొనసాగుతాయని తెలిపారు.
 
  పూర్తి కాలానికి లైఫ్ ప్రొటెక్షన్ లభిస్తుందని పేర్కొన్నారు. 18-55  సంవత్సరాల వయస్సున్న వ్యక్తులు ఈ పాలసీకి అర్హులని, కనీస బీమా రూ. 1లక్ష అని, 10/20/ 30/40/50 సంవత్సరాల కాలానికి పాలసీ తీసుకోవచ్చని అనుప్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement