ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ క్రేజీవాల్కు తనకు శత్రుత్వం లేదని సామాజిక కార్యకర్త స్ఫష్టం చేశారు. ఆయనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నట్లు హజరే తెలిపారు.
మహారాష్ట్ర: ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ క్రేజీవాల్కు తనకు శత్రుత్వం లేదని సామాజిక కార్యకర్త అన్నా హజారే స్ఫష్టం చేశారు. ఆయనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నట్లు హజరే తెలిపారు. వీరిద్దరూ విభేదాలు పొడిచూపాయని ఆరోపణల నేపథ్యంలో హజారే మంగళవారం మీడియాతో మాట్లాడారు. 'మేము ఇద్దరం శత్రువులం కాదు.మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు. కేజ్రీవాల్తో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని' హజారే తెలిపారు. తాను మాట్లాడానికి సిద్ధంగా ఉన్నా, కేజ్రీవాల్ తనతో మాట్లాడతాడా?లేదా?అని విషయం తనకు తెలియదన్నారు.
లోక్‌పాల్ ఉద్యమం కోసం 2011లో వసూలు చేసిన విరాళాల సొమ్మును ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారానికి వాడుకుంటోందని ఆరోపణలు రావడంతో అన్నా హజారే ఈ విషయమై ఆదివారం కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. దీనిపై వివరణ కోసం తాను కేజ్రీవాల్ కలుస్తానని తెలిపారు. తాను ఏ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి లేదన్నారు. ఈ డిసెంబర్ 29న రామ్ లీలా మైదానంలో జనలోక్ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.ఆ బిల్లును పార్లమెంట్ లో ఆమోదం వరకూ పోరాడతామన్నారు.