కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు రాజా సస్పెన్షన్ | RAJA Assam Cong leader suspended from party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు రాజా సస్పెన్షన్

Jun 1 2014 4:57 PM | Updated on Mar 18 2019 9:02 PM

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సీనియర్ కాంగ్రెస్ నేత అనిల్ రాజాను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

గౌహతి:  పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సీనియర్ కాంగ్రెస్ నేత అనిల్ రాజాను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంతకుముందే అతన్ని పార్టీ జనరల్ సెక్రటరీ హోదా నుంచి తొలగించిన అస్సాం పీసీసీ..  తాజాగా పార్టీ నుంచి వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు భవనేశ్వర్ కాలితా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం పార్టీ వ్యతిరేక కార్యకలాపాకు పాల్పడుతున్న అతనిని తొలగిస్తున్నట్లు తెలిపారు.

 

కాంగ్రెస్ ఎదుర్కొనే సవాళ్లును పార్టీ నేతలు అంతా కలిసికట్టుగా అధిగమించడానికి యత్నించాలని చెప్పినా రాజా మాత్రం వాటిని అతిక్రమించాడని కాలితా స్పష్టం చేశారు. గత 2009 లోక్ సభకు నోవ్ గాంగ్ నుంచి పోటీచేసిన రాజా ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement