పీఎస్‌యూలకు సమానావకాశాలు అవసరం | Pranab promotes PSE listing to level playing field | Sakshi
Sakshi News home page

పీఎస్‌యూలకు సమానావకాశాలు అవసరం

Dec 14 2013 1:57 AM | Updated on Nov 9 2018 5:30 PM

పీఎస్‌యూలకు సమానావకాశాలు అవసరం - Sakshi

పీఎస్‌యూలకు సమానావకాశాలు అవసరం

పోటీ సత్తా పెంపొందడానికి ప్రభుత్వరంగ సంస్థలకు (పీఎస్‌ఈ) సమాన అవకాశాలు అవసరమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: పోటీ సత్తా పెంపొందడానికి ప్రభుత్వరంగ సంస్థలకు (పీఎస్‌ఈ) సమాన అవకాశాలు అవసరమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం పేర్కొన్నారు. గ్లోబల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ... సమానావకాశాలు, నిర్ణయాలు తీసుకోవడంలో స్వయంప్రతిపత్తి వంటి అంశాలు పీఎస్‌యూలను స్టాక్ మార్కెట్లలో లిస్టయ్యే సామర్థ్యానికి చేరువచేస్తాయని, వాటి పనితీరును మెరుగుపరుస్తాయని అన్నారు. 260 సంస్థల్లో కేవలం 60 మాత్రమే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో లిస్టయిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.  వెసులుబాటు, నిర్వహణ, సత్వర నిర్ణయాలు వంటి అంశాల్లో ప్రభుత్వ-ప్రైవేటు రంగాల మధ్య సమాన అవకాశాలు నెలకొనడానికి ఎంతో చేయాల్సి ఉంటుందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement