పోలీసులకు ప్రీతిజింటా వాంగ్మూలం | Sakshi
Sakshi News home page

పోలీసులకు ప్రీతిజింటా వాంగ్మూలం

Published Tue, Jun 24 2014 11:19 PM

పోలీసులకు ప్రీతిజింటా వాంగ్మూలం - Sakshi

ముంబై: తన మాజీ ప్రియుడు నెస్ వాడియాపై పెట్టిన వేధింపుల కేసులో బాలీవుడ్ నటి ప్రీతీజింటా మంగళవారం సాయంత్రం ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో పోలీసులకు సుమారు గంటన్నరపాటు వాంగ్మూలం ఇచ్చారు. స్టేడియం ఆవరణలోని బీసీసీఐ కార్యాలయంలో రాత్రి 8:20 గంటల వరకూ ఆమె నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. అనంతరం 20 నిమిషాలపాటు నాటి ఘటన పరిణామక్రమాన్ని పోలీసులు అంచనా వేయడంలో సాయపడ్డారు. మే 30న ఈ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్‌లో భాగంగా కింగ్స్-11 పంజాబ్ (ప్రీతి, వాడియా ఈ జట్టు సహ యజమానులు), చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వాడియా తనను వేధించినట్లు, తన గౌరవానికి భంగం కలిగించినట్లు ప్రీతీజింటా ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే.

 

వాడియాపై ఫిర్యాదు చేసిన అనంతరం ప్రీతి అమెరికా వెళ్లిపోవడంతో ఈ సంఘటన కచ్చితంగా ఏ ప్రదేశంలో జరిగింది? ఆ సమయంలో చుట్టూ ఎవరున్నారు? అనే విషయాలపై మరోసారి వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు స్వదేశం తిరిగి రావాల్సిందిగా పోలీసులు ప్రీతిని కోరారు. దీంతో ఆదివారం ముంబై చేరుకున్న ప్రీతి మంగళవారం సాయంత్రం స్టేడియానికి వచ్చి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement