నైజీరియాలో వంద మందిపైగా ఊచకోత | Over 100 killed in Islamist attack in Nigeria | Sakshi
Sakshi News home page

నైజీరియాలో వంద మందిపైగా ఊచకోత

Feb 17 2014 7:57 PM | Updated on Sep 2 2017 3:48 AM

నైజీరియాలో ఉగ్రవాదులు మారణకాండ సృష్టించారు.

కానో: నైజీరియాలో ఉగ్రవాదులు మారణకాండ సృష్టించారు.ఈశాన్య నైజీరియా బోర్నో రాష్ట్రంలో క్రై స్తవులు అధికంగా ఉండే ఇఘే గ్రామంపై దాడిచేసి దాదాపు వంద మందిని ఊచకోత కోశారు. శనివారం రాత్రి ఆరు ట్రక్కులు, ద్విచక్ర వాహనాలపై ఆయుధాలతో సైనిక దుస్తుల్లో వచ్చిన దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బార్నాబాస్ అనే రైతు వెల్లడించారు. ఈ ఘటనతో భీతిల్లిన చాలామంది గ్రామస్తులు ఇళ్లను వదలి పారిపోయారు.

 

ఆ దుండగులు బోకో హరామ్ ఇస్లామిస్ట్ బోకో హరామ్‌కు చెందినవారుగా అనుమానిస్తున్నట్లు స్థానిక సెనేటర్ అలీ డుమె ఏఎఫ్‌పీ వార్తాసంస్థకు వెల్లడించారు. 60 మంది మతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామని, మిగతావాటికి చేయాల్సి ఉందని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement