సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న ఉల్లి ధరలు రెండు మూడు వారాల్లో తగ్గుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ చెప్పారు.
సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న ఉల్లి ధరలు రెండు మూడు వారాల్లో తగ్గుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ చెప్పారు. మహారాష్ట్ర ఇతర ప్రాంతాల్లో పండించిన కొత్త పంట మార్కెట్లోకి వస్తుందని, దీంతో కొనుగోలు దారులకు ఉపశమనం కలుగుతుందన్నారు. గురువారమిక్కడ రైతులు, వర్తకులతో పవార్ సమావేశమయ్యారు.
ఖరీఫ్లో సాగుచేసిన ఉల్లి ఆశించిన స్థాయిలో మార్కెట్కు వస్తుందని పవార్ చెప్పారు. ఉల్లి సరఫరా పెరిగే అవకాశముందన్నారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఉల్లి ధర చిల్లరగా కిలోకు 70-80 రూపాయలు పలుకుతోంది.