ఓఎన్‌జీసీ చైర్మన్ వాసుదేవకు స్కోప్ అవార్డు | ONGC Chairman Sudhir Vasudeva wins SCOPE award | Sakshi
Sakshi News home page

ఓఎన్‌జీసీ చైర్మన్ వాసుదేవకు స్కోప్ అవార్డు

Dec 13 2013 3:49 AM | Updated on Sep 2 2017 1:32 AM

ఓఎన్‌జీసీ చైర్మన్ వాసుదేవకు స్కోప్ అవార్డు

ఓఎన్‌జీసీ చైర్మన్ వాసుదేవకు స్కోప్ అవార్డు

ఓఎన్‌జీసీ చైర్మన్ సుధీర్ వాసుదేవకు స్కోప్ ఇండివిడ్యువల్ లీడర్షిప్ అవార్డు లభించింది.

 న్యూఢిల్లీ: ఓఎన్‌జీసీ చైర్మన్ సుధీర్ వాసుదేవకు స్కోప్ ఇండివిడ్యువల్ లీడర్షిప్ అవార్డు లభించింది. ప్రభుత్వరంగ సంస్థల పనితీరు ఆధారంగా స్కోప్ సంస్థ అవార్డులనందిస్తోంది. మహారత్న/నవరత్న పీఎస్‌యూల కేటగిరిలో వ్యక్తిగత నాయకత్వం కింద స్కోప్ ఎక్స్‌లెన్స్ అవార్డు సుధీర్ వాసుదేవకు లభించింది. మినీరత్న కేటగిరిలో ఈ అవార్డు ఇంజినీర్స్ ఇండియా హెడ్ ఏ.కె. పుర్వహ ఎంపికయ్యారు. లాభాలార్జిస్తున్న ఇతర పీఎస్‌యూల కేటగిరిలో ఈ అవార్డు జాతీయ బలహీనవర్గాల ఆర్థిక, అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ ఏ.ఏ. నఖ్వీకి లభించింది. పీఎస్‌యూల్లో అద్వితీయ ప్రతిభ కనబరిచిన మహిళా మేనేజర్ అవార్డ్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గ్రూప్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న నీరుకు లభించింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement