
లాస్ ఏంజెలిస్ విమానాశ్రయంలో కాల్పులు
అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే లాస్ ఏంజెలిస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు.
లాస్ ఏంజెలిస్: అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే లాస్ ఏంజెలిస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మిలటరీ దుస్తులు ధరించి, అత్యాధునిక తుపాకీతో ఉన్న ఒక దుండగుడిని పోలీసులు పట్టుకున్నారు.
అయితే, ఈ దాడిలో ఎంత మంది పాల్గొన్నారనే విషయం తెలియలేదు. మొదట విమానాశ్రయంలోని టెర్మినల్ 3 నుంచి కాల్పులు ప్రారంభమయ్యా యి. దీంతో అధికారులు వెంటనే విమానాశ్రయంలోని రెండు టెర్మినళ్లను ఖాళీ చేయించి, గాలింపు చేపట్టారు. అంతకుముందు టేకాఫ్ అయిన విమానాలను కిందికి దింపారు. బయలుదేరాల్సిన విమానాలను రద్దు చేశారు. అంబులెన్సులను విమానాశ్రయానికి తరలించారు. అయితే, ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు ప్రకటించారు.