breaking news
Los Angeles airport
-
లోడెడ్ గన్ తో ఎయిర్ పోర్ట్ కు.. సింగర్ అరెస్టు!
-
లోడెడ్ గన్ తో ఎయిర్ పోర్ట్ కు.. సింగర్ అరెస్టు!
మందుగుండు నింపిన తుపాకీతో విమానాశ్రయానికి వచ్చిన ఓ సింగర్ అరెస్టయ్యాడు. ప్రముఖ అమెరికా ర్యాపర్ కూలియో తన బ్యాగులో లోడెడ్ గన్ పెట్టుకొని లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టుకు వచ్చాడు. విమానాశ్రయ సిబ్బంది తనిఖీల్లో తుపాకీ దొరకడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సిబ్బంది విచారణలో మరిన్ని విషయాలు వెలుగుచూశాయి. ఓ అనుమానిత సహ ప్రయాణికుడికి సంబంధించిన వస్తువులను తన బ్యాగులో పెట్టుకొని కూలియో ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. అతని సహ ప్రయాణికుడు తనిఖీలకు ముందే ఈ వస్తువులను అతనికి అప్పగించినట్టు గుర్తించారు. అతడు విమానంలో వెళ్లిపోవడంతో కూలియోను పోలీసులు ప్రశ్నించారు. అయితే, అతడు కూలియో బాడీగార్డేనని కథనాలు వస్తున్నాయి. అరెస్టు చేసి ప్రశ్నించిన అనంతరం కూలియోను, అతని బాడీగార్డును బెయిల్ పై విడుదల చేసినట్టు తెలుస్తోంది. తన అరెస్టుపై ఆందోళన వ్యక్తం చేసి.. తనకు మద్దతుగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులకు ర్యాపర్ కూలియో కృతజ్ఞతలు తెలిపారు. -
షారూక్‌కు మళ్లీ చేదు అనుభవం
లాస్ ఏంజెలిస్/న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్ ఖాన్‌కు అమెరికాలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. లాస్ ఏంజెలిస్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గత ఏడేళ్లలో షారూక్‌ను ఇలా అదుపులోకి తీసుకోవడం ఇది మూడోసారి. దీనిపై షారూక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. భద్రతా చర్యలను అమలు చేయడం బాగానే ఉన్నా, ఇలా పదేపదే తనను అదుపులోకి తీసుకోవడం ఇబ్బందికరంగా ఉందని ట్వీట్ చేశారు. విమాన ప్రయాణాలపై అమెరికా నిషేధం విధించిన 80 వేల మంది జాబితాలో షారుఖ్ ఖాన్ అనే మరో వ్యక్తి పేరు ఉండడంతో బాలీవుడ్ బాద్షాకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా, షారూక్‌కు కలిగిన ఇబ్బందిపై అమెరికా విదేశాంగశాఖ దక్షిణాసియా విభాగం సహాయ మంత్రి నిషా దేశాయ్ బిస్వాల్ ట్విటర్లో క్షమాపణ చెప్పారు. భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ. షారూక్‌కు కలిగిన ఇబ్బందిపై శుక్రవారం ఢిల్లీలో క్షమాపణ చెప్పారు. మళ్లీ ఇలాంటి సంఘటన జరక్కుండా చూస్తామన్నారు. షారూక్ స్పందిస్తూ, తన ఇబ్బందిని అర్థం చేసుకున్నందుకు వర్మకు ధన్యవాదాలు తెలిపారు. -
ఆ విషయం తెలియగానే షాకయ్యా: మమత
కోల్‌కతా: అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారణ పేరుతో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్‌ను నిర్బంధించడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. ఈ విషయం తెలియగానే తాను షాకయ్యానని, ఈ ఘటన చాలా దురదృష్టకరమని, అమానవీయమని అన్నారు. భద్రత ముఖ్యమని, అలాగని తనిఖీల పేరిట వేధించడం తగదని మమత ట్వీట్ చేశారు. అమెరికాలో యాలె యూనివర్శిటీని సందర్శించేందుకు వెళ్లిన షారుక్‌ను లాస్ ఏంజిలెస్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. విచారణ పేరుతో దాదాపు రెండు గంటలు అదుపులో ఉంచుకుని తర్వాత వదిలిపెట్టారు. దీనిపై షారుక్ సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ ఈ ఘటనపై స్పందిస్తూ షారుక్‌కు క్షమాపణలు చెప్పారు. -
షారుక్‌కు అమెరికా క్షమాపణ
-
షారుక్‌కు అమెరికా క్షమాపణ
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌కు అమెరికా క్షమాపణ చెప్పింది. లాస్ ఏంజెలిస్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ సిబ్బంది ఆయనను నిర్బంధించడంతో తీవ్ర ఆవేదనకు గురైన షారుక్.. ట్విట్టర్ ద్వారా తన ఆగ్రహాన్ని వెళ్లగక్కిన విషయం తెలిసిందే. పదే పదే తనను అమెరికాలో ఇలా అవమానిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. షారుక్‌ను అమెరికా విమానాశ్రయంల ఆపేయడం ఇప్పటికి ఇది మూడోసారి. (చదవండి: అమెరికాలో షారుక్ ఖాన్‌కు చేదు అనుభవం) దాంతో అమెరికా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారి ఒకరు షారుక్ ఖాన్‌కు క్షమాపణ చెబుతూ ట్వీట్ చేశారు. 'విమానాశ్రయంలో కలిగిన అసౌకర్యానికి సారీ షారుక్ ఖాన్.. కానీ అమెరికన్ దౌత్యవేత్తలను కూడా అదనపు తనిఖీల కోసం ఆపుతాం' అని ఆయన ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అయితే, ఎలాంటి కారణం లేకుండా షారుక్‌ను మళ్లీ మళ్లీ ఆపడంపై భారత ప్రభుత్వ వర్గాలు కూడా తీవ్ర అసంతృప్తి తెలిపాయి. ఇక షారుక్ ఎలా బయటకు వచ్చారన్న విషయం కూడా స్పష్టంగా తెలియరాలేదు. ఆయన తనంతట తానే వచ్చారా.. లేదా భారత అధికారులు కల్పించుకున్న తర్వాత అమెరికా ప్రభుత్వం స్పందించిందా అన్న విషయం తెలియలేదు. -
అమెరికాలో షారుక్ ఖాన్‌కు చేదు అనుభవం
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. లాస్ ఏంజెలిస్ విమానాశ్రయంలో ఆయనను అధికారులు నిర్బంధించారు. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి భద్రతా ఏర్పాట్లు ఎంత ముఖ్యమో తనకు పూర్తిగా తెలుసునని, కానీ, ప్రతిసారీ అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్బంధించడం అంటే చిరాకు వేస్తుందని అంటూ ఈ విషయాన్ని స్వయంగా షారుక్ ఖానే ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే అదే సమయంలో కాలక్షేపం కోసం తాను ఏం చేశానో కూడా చెప్పారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి అనుమతి వచ్చేవరకు వేచి చూస్తూ మంచి పోకిమన్లను పట్టుకున్నానని అన్నారు. షారుక్ ఖాన్‌ను అమెరికా విమానాశ్రయంలో అడ్డుకోవడం ఇది మొదటి సారి కాదు. 2012 ఏప్రిల్‌లో కూడా ఆయనను న్యూయార్క్ విమానాశ్రయంలో రెండు గంటల పాటు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆపేశారు. ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని, కారణం ఏమీ లేకుండా రెండు మూడు గంటల పాటు విమానాశ్రయంలో ఆగిపోవడం భలే చిరాకు అని ఇంతకుముందు ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. తన పిల్లలను మంచి యూనివర్సిటీలో చేర్చడం కోసమే తరచు అమెరికా వెళ్తున్నానని ఆయన వివరించారు. నిజానికి అంతకుముందే 2010లో మై నేమ్ ఈజ్ ఖాన్ (అయామ్ నాట్ ఎ టెర్రరిస్ట్) అనే సినిమా కూడా షారుక్ హీరోగా వచ్చింది. I fully understand & respect security with the way the world is, but to be detained at US immigration every damn time really really sucks. — Shah Rukh Khan (@iamsrk) 12 August 2016 The brighter side is while waiting caught some really nice Pokemons. — Shah Rukh Khan (@iamsrk) 12 August 2016 -
విమానంలో అరబిక్‌లో మాట్లాడినందుకు..
వాషింగ్టన్: ఎలాంటి కారణం లేకుండానే అమెరికాలో విమానం నుంచి మరో ప్రయాణికుడిని దించివేశారు. అరబిక్ భాషలో మాట్లాడినందుకే ఇలా చేశారని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్కెలీ విద్యార్థి ఖైరుల్దీన్ మఖ్జూమీ (26) వాపోయాడు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మఖ్జూమీ ఇరాక్ నుంచి శరణార్థుడిగా అమెరికాకు వచ్చాడు. ఈ నెల 9న లాస్ ఏంజిలెస్ నుంచి కాలిఫోర్నియా వెళ్లేందుకు సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కాడు. విమానం బయల్దేరేముందు మఖ్జూమీ బంధువుకు ఫోన్ చేసి అరబిక్‌లో మాట్లాడాడు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ పాల్గొనే సెమీనార్ గురించి చర్చించాడు. ఈ ఈవెంట్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థపై అడగాల్సిన ప్రశ్న గురించి మాట్లాడాడు. విమానంలో మఖ్జూమీ మందు వరుస సీటులో కూర్చున్న ఓ మహిళ అతనితో వాదనకు దిగింది. ఈ విషయాన్ని విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో అరబిక్ భాషలో ఎందుకు మాట్లాడావని మఖ్జూమీని ప్రశ్నించారు. అతణ్ని విమానం నుంచి దించివేశారు. ఎఫ్‌బీఐ అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించి వదిలేశారు. మఖ్జూమీపై ఎలాంటి అనుమానాలు లేవని, చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. మఖ్జూమీ 8 గంటల అనంతరం మరో విమానంలో వెళ్లాడు. ఈ ఘటనపై మఖ్జూమీ స్పందిస్తూ.. తనకు, తన కుటుంబానికి ఇలాంటి అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయని, ఇది కేవలం మరో ఘటన అని అన్నాడు. -
లాస్ ఏంజెలిస్ విమానాశ్రయంలో కాల్పులు
లాస్ ఏంజెలిస్: అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే లాస్ ఏంజెలిస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మిలటరీ దుస్తులు ధరించి, అత్యాధునిక తుపాకీతో ఉన్న ఒక దుండగుడిని పోలీసులు పట్టుకున్నారు. అయితే, ఈ దాడిలో ఎంత మంది పాల్గొన్నారనే విషయం తెలియలేదు. మొదట విమానాశ్రయంలోని టెర్మినల్ 3 నుంచి కాల్పులు ప్రారంభమయ్యా యి. దీంతో అధికారులు వెంటనే విమానాశ్రయంలోని రెండు టెర్మినళ్లను ఖాళీ చేయించి, గాలింపు చేపట్టారు. అంతకుముందు టేకాఫ్ అయిన విమానాలను కిందికి దింపారు. బయలుదేరాల్సిన విమానాలను రద్దు చేశారు. అంబులెన్సులను విమానాశ్రయానికి తరలించారు. అయితే, ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు ప్రకటించారు.