
లోడెడ్ గన్ తో ఎయిర్ పోర్ట్ కు.. సింగర్ అరెస్టు!
మందుగుండు నింపిన తుపాకీతో విమానాశ్రయానికి వచ్చిన ఓ సింగర్ అరెస్టయ్యాడు.
మందుగుండు నింపిన తుపాకీతో విమానాశ్రయానికి వచ్చిన ఓ సింగర్ అరెస్టయ్యాడు. ప్రముఖ అమెరికా ర్యాపర్ కూలియో తన బ్యాగులో లోడెడ్ గన్ పెట్టుకొని లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టుకు వచ్చాడు. విమానాశ్రయ సిబ్బంది తనిఖీల్లో తుపాకీ దొరకడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సిబ్బంది విచారణలో మరిన్ని విషయాలు వెలుగుచూశాయి. ఓ అనుమానిత సహ ప్రయాణికుడికి సంబంధించిన వస్తువులను తన బ్యాగులో పెట్టుకొని కూలియో ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. అతని సహ ప్రయాణికుడు తనిఖీలకు ముందే ఈ వస్తువులను అతనికి అప్పగించినట్టు గుర్తించారు. అతడు విమానంలో వెళ్లిపోవడంతో కూలియోను పోలీసులు ప్రశ్నించారు.
అయితే, అతడు కూలియో బాడీగార్డేనని కథనాలు వస్తున్నాయి. అరెస్టు చేసి ప్రశ్నించిన అనంతరం కూలియోను, అతని బాడీగార్డును బెయిల్ పై విడుదల చేసినట్టు తెలుస్తోంది. తన అరెస్టుపై ఆందోళన వ్యక్తం చేసి.. తనకు మద్దతుగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులకు ర్యాపర్ కూలియో కృతజ్ఞతలు తెలిపారు.