క్రీడామంత్రిగా ఒలింపిక్ పతక విజేత | Olympic medallist Carlos Espinola is Argentine sports minister | Sakshi
Sakshi News home page

క్రీడామంత్రిగా ఒలింపిక్ పతక విజేత

Feb 6 2014 2:32 PM | Updated on Sep 2 2017 3:24 AM

ఒలింపిక్ క్రీడల్లో నాలుగు సార్లు మెడల్స్ సాధించిన కార్లోస్ ఎస్పినోలాను అర్జెంటీనా ప్రభుత్వం క్రీడామంత్రిగా నియమించింది. సెయిలింగ్ క్రీడలో అర్జెంటీనాకు కార్లోస్ నాలుగు పతకాలు సాధించిపెట్టాడు.

ఒలింపిక్ క్రీడల్లో నాలుగు సార్లు మెడల్స్ సాధించిన కార్లోస్ ఎస్పినోలాను అర్జెంటీనా ప్రభుత్వం క్రీడామంత్రిగా నియమించింది. సెయిలింగ్ క్రీడలో అర్జెంటీనాకు కార్లోస్ నాలుగు పతకాలు సాధించిపెట్టాడు.
 
కార్లోస్ ను క్రీడా మంత్రిగా నియమిస్తూ అర్జెంటీనా అధ్యక్షుడు క్రిస్టినా ఫెర్నాండెజ్ ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రభుత్వ గెజిట్ లో ప్రచురించారు. మేయర్ గా కొర్రిఎంటెస్ పదవి కాలం గత డిసెంబర్ లో ముగిసింది. గత సంవత్సరం కొరిఎంటెస్ గవర్నర్ గా పోటీ చేసి కార్లోస్ ఓటమి పాలైయ్యారు. 
 
అర్జెంటినా దేశానికి సెయిలింగ్ క్రీడలో అత్యధిక ఒలింపిక్ పతకాలను సాధించిన క్రీడాకారుడిగా కార్లోస్ కు గుర్తింపు ఉంది. 1996 లో అట్లాంటా, 2000 సిడ్నీ, 2004, 2008 సంవత్సరాల్లో జరిగిన ఒలంపిక్ క్రీడల్లో పతకాలను సాధించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement