బాహుబలి నామకరణం ఖరారు! | Officers used the Bahubali name for the tiger | Sakshi
Sakshi News home page

బాహుబలి నామకరణం ఖరారు!

May 11 2017 4:10 PM | Updated on Sep 5 2017 10:56 AM

బాహుబలి నామకరణం ఖరారు!

బాహుబలి నామకరణం ఖరారు!

బారంగ్‌ జంతు ప్రదర్శన శాల నందన్‌కానన్‌లో జన్మించిన పులిబిడ్డకు బాహుబలిగా నామకరణం చేయడం విశేషం.

భువనేశ్వర్‌ (బారంగ్‌): నగర శివార్లు బారంగ్‌ జంతు ప్రదర్శన శాల నందన్‌కానన్‌లో జన్మించిన పులిబిడ్డకు బాహుబలిగా నామకరణం చేయడం విశేషం. నందన్‌కానన్‌లో విజయ, మేఘ, స్నేహ అనే మూడు పులులు ప్రసవించిన 7 పులిపిల్లలకు బుధవారం నామకరణం చేశారు. సినీ రంగంలో సంచలనం సృష్టించిన బాహుబలి పేరును వీటిలో ఒక పిల్లకు పెట్టేందుకు అధికారులు నిర్ణయించారు. బాహుబలి నామకరణం ఖరారు చేయడం వెనక బలమైన ప్రజాభిప్రాయం ఉండడం మరో విశేషం.

నందన్‌కానన్‌కు పలు ప్రాంతాల నుంచి విచ్చేసే పర్యాటకులను కొత్తగా జన్మించిన పులి పిల్లలకు పేర్లను ప్రతిపాదించాలని అధికారులు కోరారు.   ఈ క్రమంలో పర్యాటకులు  పేర్లను ప్రతిపాదించారు. ప్రజాభిప్రాయంలో అత్యధికంగా 52 శాతం మంది బాహుబలి పేరును ప్రతిపాదించారు. ప్రజాభిప్రాయానికి పట్టం గడుతూ ఒక పులిపిల్లకు బాహుబలి పేరును ఖరారు చేశారు. మిగిలిన 6 పులి పిల్లలకు కుందన్, సాహిల్, ఆద్యాశ, చిన్ను, విక్కి, మౌసుమిగా పేరు పెట్టారు. కొత్త పులి పిల్లల్ని అంచెలంచెలుగా పర్యాటకుల సందర్శన కోసం ఎంక్లోజర్‌లో  బహిరంగపరుస్తారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement