'డెంగ్యూ ప్రబలుతోంది.. దృష్టిపెట్టండి' | observe dengue disease says ayyannapathrudu | Sakshi
Sakshi News home page

'డెంగ్యూ ప్రబలుతోంది.. దృష్టిపెట్టండి'

Jul 29 2015 9:33 PM | Updated on Apr 6 2019 9:01 PM

రాష్ట్రంలో పలు జిల్లాల్లో డెంగ్యూ వాధి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, వ్యాధి నియంత్రణ చర్యలపై అధికారులు దృష్టి సారించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు అధికారులను ఆదేశించారు.

జిల్లా అధికారులతో మంత్రులు వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్: రాష్ట్రంలో పలు జిల్లాల్లో డెంగ్యూ వాధి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, వ్యాధి నియంత్రణ చర్యలపై అధికారులు దృష్టి సారించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో పాటు చికెన్ గున్యా, డెంగ్యూ జర్వాలు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం జిల్లా అధికారులతో మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మంత్రులు పీతల సుజాత, కామినేని శ్రీనివాస్, 13 జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలు, డీపీఓ సమావేశంలో పాల్గొన్నారు. ఏజెన్సీ ఏరియాతో పాటు అనుమానిత అన్ని గ్రామాల్లో తరుచూ రక్ష పరీక్ష నిర్వహించాలని మంత్రులు అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్, మున్సిపల్, గ్రామీణ నీటి సరఫరా, ఆరోగ్య శాఖల అధికారులు ప్రతి 15 రోజులకొకసారి సమావేశమై.. వ్యాధులపై చర్చించాలని ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రత విషయంలో ఎక్కడా అశ్రద్ధ వహించవద్దని హెచ్చరించారు. మంత్రి కామినేని మాట్లాడుతూ.. వైద్య శాఖ కమిషనరేట్‌లో 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement