మధుమేహరోగుల గాయాన్ని తగ్గించే బ్యాండేజీ | Now can cure injuries of diabetic patients | Sakshi
Sakshi News home page

మధుమేహరోగుల గాయాన్ని తగ్గించే బ్యాండేజీ

Aug 20 2016 10:38 PM | Updated on Sep 4 2017 10:06 AM

మధుమేహరోగుల గాయాన్ని తగ్గించే బ్యాండేజీ

మధుమేహరోగుల గాయాన్ని తగ్గించే బ్యాండేజీ

మధుమేహంతో బాధపడేవారికి చిన్న గాయమైనా సరే.. అంత తేలిగ్గా మానదు.

చికాగో: మధుమేహంతో బాధపడేవారికి చిన్న గాయమైనా సరే.. అంత తేలిగ్గా మానదు. అది తగ్గే వరకు వారి బాధ వర్ణణాతీతం. అలాంటి వారికోసమే నార్త్‌ వెస్టర్న్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త బ్యాండేజీని తయారు చేశారు. ఎస్‌డీఎఫ్‌–1 ప్రొటీ తో కూడిన ఈ ప్లాస్టిక్‌ బ్యాండేజీ నుంచి ప్రోటీ నిదానంగా విడుదలవుతుంది. ఈ బ్యాండేజీని గాయమైన చోట అతికిస్తే అక్కడ కొత్త రక్తనాళాలు వేగంగా పెరిగేట్టు చేయడమే కాకుండా గాయాలను తొందరగా మానిపోయేందుకు సహకరించే మూలకణాలను ఆకర్షిస్తుంది.

ఫలితంగా రక్తప్రసరణ పెరిగి గాయం త్వరగా మానిపోతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు స్పర్శ జ్ఞానం తక్కువగా ఉండడంవల్ల కొన్ని సార్లు గాయాల నొప్పి కూడా తెలియకపోవడంతో చికిత్స తీసుకోరు. ఫలితంగా ఈ గాయాలైన అవయవాలను తొలగించాల్సిన పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. పైగా రక్తంలో చక్కెర మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల రక్త ప్రసరణ తగ్గిపోయి గాయం మానేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఇటువంటి సమస్యలన్నింటినీ ఈ బ్యాండేజీ పరిష్కరిస్తుందని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement