ఆ పద్ధతి మార్చే స్కోపే లేదు | No scope of change in triple talaq system: Qureshi | Sakshi
Sakshi News home page

ఆ పద్ధతి మార్చే స్కోపే లేదు

Sep 3 2015 11:53 AM | Updated on Sep 3 2017 8:41 AM

ఆ పద్ధతి మార్చే స్కోపే లేదు

ఆ పద్ధతి మార్చే స్కోపే లేదు

ముస్లిం మహిళలకు విడాకులు ఇచ్చే సంప్రదాయంలో మార్పులు చేసే సమస్యే లేదని ఉత్తరప్రదేశ్లోని ముస్లింపెద్దలు స్పష్టం చేశారు.

లక్నో: ముస్లిం మహిళలకు విడాకులు ఇచ్చే సంప్రదాయంలో మార్పులు చేసే సమస్యే లేదని ఉత్తరప్రదేశ్లోని ముస్లింపెద్దలు స్పష్టం చేశారు. దీనిపై ఎవరి అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. సాధారణంగా మూడు సార్లు తలాఖ్ అని అంటే ముస్లిం జంటలకు విడాకులు మంజూరైనట్లే.

అయితే, ఈ విధానంలో కొంత మార్పు తీసుకురావాలని కొంత అభిప్రాయ సేకరణ చేసేందుకు ఓ మూడు నెలల సమయం ఇస్తే బాగుంటుందని ఇతర ముస్లిం సంస్థలు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ)కి తెలియజేసినట్లు తెలిసింది. అయితే, ఖురాన్, హదిత్ ప్రకారం మూడుసార్లు తలాక్ అనగా నేరం అని, కానీ ఒక్కసారి అలా అన్నారంటే మాత్రం ఇక విడాకుల కార్యక్రమం మొదలై పూర్తయినట్లేనని ఏఐఎంపీఎల్బీ అధికారిక ప్రతినిధి మౌలానా అబ్దుల్ రహీం ఖురేషి తెలిపారు. అయితే, తమకు ఎలాంటి ప్రత్యేక విన్నపం రాలేదని, వచ్చినా అంగీకరించబోమని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement