తలాక్‌లపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

Supreme Court Issues Notice To Centre On Talaq Unconstitutional - Sakshi

న్యూఢిల్లీ: ఇస్లాంలో తలాక్‌–ఎ–కినయా, తలాక్‌–ఎ–బెయిన్‌తో పాటు అన్నిరకాల విడాకులనూ రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై స్పందన తెలపాల్సిందిగా కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు కేంద్ర న్యాయ, మైనారిటీ వ్యవహారాల శాఖలకు నోటీసులు జారీ చేసింది. కర్నాటకకు చెందిన సయేదా అంబ్రీన్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్, జస్టిస్‌ జె.బి.పార్డీవాలాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.

ఇదీ చదవండి: కొలీజియంలో విభేదాలు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top