'నా సింహాలు ఎలా చనిపోయాయో చెప్పండి' | My lions have died, I want an inquiry into it, Mulayam Singh tells Centre | Sakshi
Sakshi News home page

'నా సింహాలు ఎలా చనిపోయాయో చెప్పండి'

Aug 10 2016 11:44 AM | Updated on Sep 4 2017 8:43 AM

గుజరాత్ నుంచి బహుమతిగా అందుకున్న సింహాలు ఎలా మరణించాయో చెప్పాలని..

న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రం నుంచి ఉత్తరప్రదేశ్ బహుమతిగా అందుకున్న రెండు సింహాలు చనిపోయాయని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ ములాయం సింగ్ యాదవ్ మంగళవారం లోక్ సభలో చెప్పారు. అవి ఎలా చనిపోయాయో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు సింహాలను ఎటవాహ్ వైల్డ్ లైఫ్ లయన్ సఫారీ పార్కుకు బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, తనకు ఇది డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ములాయాం ఈ అంశాపై విచారణ చేయాలని కేంద్రాన్ని కోరారు. అందుకు స్పందించిన పర్యావరణశాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే కారణాలను త్వరలోనే కారణాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement