విశ్వ సుందరి గాబ్రియెలా | MISS VENEZUELA GABRIELA ISLER WINS MISS UNIVERSE 2013 | Sakshi
Sakshi News home page

విశ్వ సుందరి గాబ్రియెలా

Nov 11 2013 2:00 AM | Updated on Sep 2 2017 12:30 AM

విశ్వ సుందరి గాబ్రియెలా

విశ్వ సుందరి గాబ్రియెలా

మిస్ యూనివర్స్ కిరీటాన్ని వెనిజువెలా సుందరి మారియా గాబ్రియెలా ఇస్లర్(25) గెలుచుకున్నారు.

మాస్కో:  మిస్ యూనివ ర్స్ కిరీటాన్ని వెనిజువెలా సుందరి మారియా గాబ్రియెలా ఇస్లర్(25) గెలుచుకున్నారు. శనివారం రాత్రి ఇక్కడ జరిగిన ఫైనల్‌లో 85 మంది అందగత్తెలను తోసిరాజని ఆమె ఈ ఘనతను సాధించారు. మన దేశానికి చెందిన మానసి మోగే టాప్-10లో ప్రవేశించినా.. టాప్-5లోకి చేరలేకపోయింది.

2000లో భారత్‌కు చెందిన లారాదత్తా మిస్ యూనివర్స్‌గా ఎంపికయ్యారు. ఆ తర్వాత ఆ కిరీటం మనకు అందని ద్రాక్షగా మారింది. టీవీ యాంకర్‌గా పనిచేస్తున్న మారియా.. స్పెయిన్ జానపద నృత్యం ఫ్లమెంకోలో దిట్ట. మిస్ యూనివర్స్‌గా ప్రకటించగానే గాబ్రియెలా ఉద్వేగానికి గురై తన శిరసుపై అలంకరించిన విశ్వసుందరి కిరీటం జారిపోతున్న విషయాన్ని కూడా గ్రహించలేకపోయారు. చివరి నిమిషంలో గమనించిన గాబ్రియెలా కిరీటం కింద పడిపోకుండా పట్టుకున్నారు. 2, 3 స్థానాల్లో మిస్ స్పెయిన్ పాట్రిసియా, మిస్ ఈక్వెడార్ కాన్‌స్టాంజా నిలిచారు.
 
 మిలియన్‌డాలర్ల స్విమ్‌సూట్‌లో గాబ్రియెలా
 మిస్ యూనివర్స్ కిరీటాన్ని సాధించిన గాబ్రియేలా మాస్కోలో విధులు ప్రారంభించారు. ఆదివారం ఆమె ఓ కార్యక్రమంలో మిలియన్ డాలర్ల (దాదాపు రూ.6 కోట్లు) విలువ చేసే స్విమ్‌సూట్‌లో కనువిందు చేశారు. ఈ స్విమ్‌సూట్‌ను 900 విలువైన రత్నాలతో రూపొందించారు. దీనికి రక్షణగా సాయుధ గార్డులు ఉన్నారని మిస్ యూనివర్స్ నిర్వాహక సంస్థ అధ్యక్షుడు పాలా షుగార్ట్ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement