కాశ్మీర్లో హిజ్బుల్ ముజాహిదీన్ అగ్రనేత అరెస్ట్ | MILITANT Top Hizbul commander arrested | Sakshi
Sakshi News home page

కాశ్మీర్లో హిజ్బుల్ ముజాహిదీన్ అగ్రనేత అరెస్ట్

Sep 4 2013 1:56 PM | Updated on Sep 1 2017 10:26 PM

హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన అగ్రనేతల్లో ఒకరైన తలిబ్ లలిని బండిపూర జిల్లాలో భద్రతాదళాలు బుధవారం అరెస్ట్ చేశాయి.

నిషేధిత తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన అగ్రనేతల్లో ఒకరైన తలిబ్ లలితోపాటు మరో ఇద్దరు తీవ్రవాదులను బండిపూర జిల్లాలో భద్రతాదళాలు ఈ రోజు అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం ఇక్కడ వెల్లడించారు. అజాస్ ప్రాంతంలో తీవ్రవాదులు ఆశ్రయం పొందినట్లు తమకు సమాచారం అందింది. ఆ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి తీవ్రవాదుల కోసం భద్రతాదళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

 

ఆ క్రమంలో పోలీసులకు, తీవ్రవాదులు తారసపడ్డారు. ఆ క్రమంలో ఇరువైపుల భీకరంగా కాల్పులు చోటు చేసుకున్నాయి. అనంతరం ఆ ముగ్గురు తీవ్రవాదులను భద్రతాదళాలు ఆదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. అయితే తీవ్రవాదులు, భద్రత దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఎవరు గాయపడలేదని తెలిపారు.

 

తీవ్రవాదులు ఆశ్రయం పొందిన ప్రదేశం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆ ముగ్గురు తీవ్రవాదులను రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాశ్మీర్ వ్యాలీ ప్రాంతంలో హిజ్బుల్ ముజాహిదీన్ వ్యాప్తికి తలిబ్ కీలక పాత్ర పోషించాడని పోలీసులు వెల్లడించారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement