
మైక్రోసాఫ్ట్ లూమియా 540
టెక్నాలజీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ‘లూమియా 540’ విండోస్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.
చెన్నై: టెక్నాలజీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ‘లూమియా 540’ విండోస్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.10,199. విండోస్ 8.1 ఓఎస్‌పై (విండోస్ 10 అప్‌గ్రేడ్ సౌకర్యం) నడిచే ఈ ఫోన్ 5 అంగుళాల హెచ్‌డీ తెర, 2,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 1 జీబీ ర్యామ్, క్వాడ్‌కోర్ 200 సిరీస్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 8 ఎంపీ రియర్ కెమెరా, డ్యూయెల్ సిమ్ వంటి ప్రత్యేకతలను క లిగి ఉంది.
చెన్నైలో మైక్రోసాఫ్ట్ ప్రయారిటీ రీసెల్లర్ స్టోర్
నోకియా స్టోర్ల రీబ్రాండింగ్ దిశగా పయనిస్తోంది మైక్రోసాప్ట్. నోకియా స్టోర్లను రీబ్రాండ్ చేసి మైక్రోసాఫ్ట్ ప్రయారిటీ రీసెల్లర్ స్టోర్లుగా మారుస్తోంది. ఇందులో భాగంగానే తన తొలి ప్రయారిటీ రీసెల్లర్ స్టోర్‌ను చెన్నై లో ప్రారంభించింది. దేశంలో 441 మైక్రోసాఫ్ట్ ప్రయారిటీ రీసెల్లర్ సోర్లు, 8,872 మొబైల్ రీసెల్లర్ స్టోర్లు ఉన్నాయని నోకియా ఇండియా సేల్స్ డెరైక్టర్(దక్షిణ ప్రాంతం) టి.ఎస్.శ్రీధర్ తెలిపారు. ఈ నెలాఖరుకు అన్ని స్లోర్ల లో మైక్రోసాఫ్ట్ ప్రయారిటీ రీసెల్లర్ లోగో కనిపిస్తుందన్నారు. నోకియా కేర్ సెంటర్లనూ మైక్రోసాఫ్ట్ కేర్‌గా రీబ్రాండ్ చేస్తామని తెలిపారు.