కిడ్నాపర్లు చెర నుంచి 44 మంది బందీలు విడుదల | Mexican police free 44 kidnap victims | Sakshi
Sakshi News home page

కిడ్నాపర్లు చెర నుంచి 44 మంది బందీలు విడుదల

Oct 20 2013 11:15 AM | Updated on Sep 1 2017 11:49 PM

రేనోసా బస్సు టెర్మినల్లో ఇటీవల కిడ్నాప్నకు గురైన 44 మందిని కిడ్నాపర్ల చెర నుంచి సురక్షితంగా రక్షించినట్లు రేనోసా ఉన్నతాధికారులు ఆదివారం ఇక్కడ వెల్లడించారు.

రేనోసా బస్సు టెర్మినల్లో ఇటీవల కిడ్నాప్నకు గురైన 44 మందిని కిడ్నాపర్ల చెర నుంచి సురక్షితంగా రక్షించినట్లు రేనోసా ఉన్నతాధికారులు ఆదివారం ఇక్కడ వెల్లడించారు.రేనోసా ఈశాన్య ప్రాంతంలోని ఓ ఇంట్లో వారంతా బందీలుగా ఉన్నారని తెలిపారు.అయితే వారిలో ఓ మహిళ తమను రక్షించండంటూ గట్టిగా అరుస్తున్న అరుపులు  అటువైపుగా గస్తీ తిరుగుతున్న పోలీసులకు వినిపించాయి.దాంతో గస్తీ పోలీసులు ఆ నివాసానికి చేరుకుని బందీలుగా ఉన్న 44 మందిని రక్షించినట్లు చెప్పారు.

 

బందీలలో 24 మంది మెక్సికన్లు, 14 మంది హుండరస్ వాసుల్లో ఐదుగురు మైనర్లుతోపాటు సెల్వడార్కు చెందిన వ్యక్తి, గ్వాటిమాల,బెలిజియన్ దేశాలకు చెందిన  ఇద్దరు మహిళలు ఉన్నారని తెలిపారు. ఇటీవల రేనోసా నగరంలోని బస్ టెర్మినల్ వద్ద వారందరిని కిడ్నాప్ చేశారు.

 

తమ వద్ద బందీలుగా ఉన్న వారిని విడుదల చేయాలంటే అధిక మొత్తంలో నగదు చెల్లించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. తాములిపాస్ రాష్ట్ర సరిహద్దుల్లో రేనోసా పట్టణం ఉంది.ఆ పట్టణంలో సరైన నివాస ప్రతాలు లేని వలసదారులపై స్థానికులు తరచుగా దాడులు, అత్యాచారాలు,కిడ్పాప్లు చేస్తున్న విషయం విదితమే.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement