చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్ | krishnaiah fires on chandrababu over jobs issue | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్

Nov 7 2015 5:52 PM | Updated on Jul 28 2018 3:30 PM

చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్ - Sakshi

చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎల్బీనగర్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆర్‌.క్రిష్ణయ్య నిప్పులు చెరిగారు.

బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. ఏవీ
►ఏపీలో ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదు
►భర్తీ చేయకపోతే ప్రభుత్వంపై పోరాటం తప్పదు
►ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య హెచ్చరిక

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య (ఎల్బీనగర్‌ నియోజకవర్గం) నిప్పులు చెరిగారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పిన చంద్రబాబు... ఏపీలో ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదని మండిపడ్డారు.

ఏపీలో లక్షా 40 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటికి సంబంధించి గ్రూప్1, 2,3, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. భర్తీ చేయకపోతే ప్రభుత్వంపై పోరాటం తప్పదని హెచ్చరించారు. బాబు వస్తే ఉద్యోగాలను భర్తీ చేయకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారన్నారు. ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్లో తొలగించిన 125 మంది కాంట్రక్ట్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement