'జమ్మూకాశ్మీర్ కు సాయమందించండి' | J-K floods: Sonia asks Cong CMs to give all possible help | Sakshi
Sakshi News home page

'జమ్మూకాశ్మీర్ కు సాయమందించండి'

Sep 9 2014 9:46 PM | Updated on Oct 22 2018 9:16 PM

'జమ్మూకాశ్మీర్ కు సాయమందించండి' - Sakshi

'జమ్మూకాశ్మీర్ కు సాయమందించండి'

జమ్మూకాశ్మీర్ ను కకావికలు చేసిన వరదలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ స్పందించారు.

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ ను కకావికలు చేసిన వరదలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ స్పందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరావాస చర్యలకు చేయగలిగినంత సాయం అందించాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను సోనియా కోరారు. వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన సోనియా ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, సేవాదళ్ వాలంటీర్లకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు మోతిలాల్ వోరా, అహ్మద్ పటేల్, ఆజాద్, అంబికా సోని సమావేశమయి జమ్మూకాశ్మీర్ లో వరద పరిస్థితి, సహాయక కార్యక్రమాలపై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement