వరద బాధితులకు సోనియా పరామర్శ | Sonia Gandhi interacts with Kashmir flood victims | Sakshi
Sakshi News home page

వరద బాధితులకు సోనియా పరామర్శ

Sep 29 2014 5:57 PM | Updated on Oct 22 2018 9:16 PM

వరద బాధితులకు సోనియా పరామర్శ - Sakshi

వరద బాధితులకు సోనియా పరామర్శ

ఈ నెల్లో జమ్మూ కాశ్మీర్ లో సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన బాధితులన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పరామర్శించారు.

శ్రీనగర్:ఈ నెల్లో జమ్మూ కాశ్మీర్ లో సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన బాధితులన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పరామర్శించారు.  సోమవారం  పార్టీ ఉపాధ్యక్షుడు, కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి ఆమె అనంతనాగ్ జిల్లాలో పర్యటించారు. వరదల్లో తీవ్రం నష్టపోయిన ప్రజల కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. సోనియా -రాహుల్ కు తోడుగా రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, మరో కాంగ్రెస్ నేత అంబికా సోనీలు కూడా జమ్మూలోని  వరద బాధితుల్ని పరామర్శించిన వారిలో ఉన్నారు. 

 

ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్.. తమ పార్టీతో తమ కుటుంబం ఎప్పుడూ ప్రజలతోనే ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం శ్రీనగర్ లో కాంగ్రెస్ నాయకులతో సమావేశమైన సోనియా గాంధీ వరద సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళవారం కూడా జమ్మూలో కాంగ్రెస్ నేతల పర్యటన కొనసాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement