ట్రంప్ కూతురు ఇలా చేసిందేమిటి..? | Ivanka Trump slammed for wearing expensive gown on protests night | Sakshi
Sakshi News home page

ట్రంప్ కూతురు ఇలా చేసిందేమిటి..?

Jan 31 2017 5:49 PM | Updated on Aug 25 2018 7:50 PM

ట్రంప్ కూతురు ఇలా చేసిందేమిటి..? - Sakshi

ట్రంప్ కూతురు ఇలా చేసిందేమిటి..?

అమెరికా నిరసనలతో హోరెత్తిపోతుంటే ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ వ్యవహరించిన తీరుపై నెటిజెన్లు తీవ్ర విమర్శలు చేశారు.

వాషింగ్టన్: ఏడు ముస్లిం మెజార్టీ దేశాల పౌరులు అమెరికాలోకి రాకుండా నిషేధం విధించాక ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా అంతటా తీవ్ర నిరసనలు  తెలియజేస్తున్నారు. శనివారం అమెరికా నిరసనలతో హోరెత్తిపోతుంటే ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ వ్యవహరించిన తీరుపై నెటిజెన్లు తీవ్ర విమర్శలు చేశారు.

శనివారం రాత్రి ఇవాంకా తన భర్త జేర్డ్ కుష్నెర్తో కలసి వాషింగ్టన్లో ఓ డిన్నర్ పార్టీకి వెళ్లారు. ఇద్దరూ ఖరీదైన దుస్తులు వేసుకున్నారు. ఇవాంకా దాదాపు 3.40 లక్షల రూపాయల విలువైన గౌన్ ధరించి పార్టీకి హాజరయ్యారు. భర్తతో కలిసున్న ఫొటోను ఇవాంకా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ రోజు రాత్రి అమెరికా విమానాశ్రయాల్లో ఆందోళనలు జరుగుతుంటే.. ఇవాంకా దంపతులు ఓ క్లబ్లో విందు వినోదాల్లో మునిగిపోయారు. ట్రంప్ కూతురి దుస్తులు, వ్యవహారంపై నెటిజెన్లు మండిపడ్డారు.

మతాన్ని బట్టి వ్యక్తులపై వివక్ష చూపడం దారుణమని, నిషేధానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే, విందువినోదాల్లో మునిగితేలుతారా అంటూ నెటిజెన్లు ఇవాంకాను విమర్శించారు. కాల్చిన ఆలూలా ఉన్నావంటూ కొందరు ఆమెను ఉద్దేశించి ట్వీట్ చేశారు. దేశం ఆందోళనలతో అట్టుడికిపోతుంటే సంబరాలు చేసుకుంటున్నారా అని విమర్శించారు.
 

దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి

(ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్‌)

(ట్రంప్‌ ‘నిషేధం’: ఐసిస్‌ విజయోత్సవాలు)

(ట్రంప్‌ చెప్పింది పచ్చి అబద్ధం!)

(అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి)

ట్రంపోనమిక్స్‌ మనకు నష్టమా? లాభమా?

ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!

ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!

వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా

'ట్రంప్‌తో భయమొద్దు.. మేమున్నాం'

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement