నాటీబోయ్.. దారిలోకి వచ్చాడు! | ISRO naughty boy becomes most obidient | Sakshi
Sakshi News home page

నాటీబోయ్.. దారిలోకి వచ్చాడు!

Aug 27 2015 6:00 PM | Updated on Sep 3 2017 8:14 AM

నాటీబోయ్.. దారిలోకి వచ్చాడు!

నాటీబోయ్.. దారిలోకి వచ్చాడు!

భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయాలను లిఖిస్తూ జీఎస్ఎల్వీ డి-6 ప్రయోగం విజయవంతం అయ్యింది. ఇప్పటివరకు 'నాటీబోయ్'గా అంతరిక్ష శాస్త్రవేత్తలు ముద్దుగా పిలుచుకునే జీఎస్ఎల్వీ.. చాలా రోజుల తర్వాత నేరుగా విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల ఆనందానికి అంతులేదు.

భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయాలను లిఖిస్తూ జీఎస్ఎల్వీ డి-6 ప్రయోగం విజయవంతం అయ్యింది. ఇప్పటివరకు 'నాటీబోయ్'గా అంతరిక్ష శాస్త్రవేత్తలు ముద్దుగా పిలుచుకునే జీఎస్ఎల్వీ.. చాలా రోజుల తర్వాత నేరుగా విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల ఆనందానికి అంతులేదు. ఇదే విషయాన్ని మిషన్ డైరెక్టర్ ఉమామహేశ్వరన్ కూడా ప్రయోగం విజయవంతం అయిన తర్వాత శాస్త్రవేత్తలను అభినందిస్తూ చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. తమ నాటీబోయ్ ఇప్పుడు బాగా క్రమశిక్షణ గల అబ్బాయిలా మారిపోయాడని, తమను అస్సలు ఇబ్బంది పెట్టకుండా మంచి విజయం సాధించాడని ఆయన అన్నారు.

దీనికి ముందు చేసిన జీఎస్ఎల్వీ డి-5 ప్రయోగం జరగడానికి సుమారు పావుగంట ముందు ఇంధనం లీకవుతున్నట్లు గుర్తించడంతో అప్పటికప్పుడు దాన్ని ఆపేసి.. తర్వాత మళ్లీ ప్రయోగించగా అప్పుడు విజయవంతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజెనిక్ ఇంజన్తో కూడిన ఈ 'నాటీబోయ్' విజయం సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement