'నైజీరియాలో భారతీయులను రోడ్లపైకి విసిరివేస్తాం' | Indians will be hit if Nigerians are targeted: Nigerian consular | Sakshi
Sakshi News home page

'నైజీరియాలో భారతీయులను రోడ్లపైకి విసిరివేస్తాం'

Nov 4 2013 9:00 PM | Updated on Oct 17 2018 5:28 PM

గోవాలో అద్దె గృహాల్లో ఉంటున్న నైజీరియా దేశస్థులను ఖాళీ చేయించడం ఆపకపోతే.. తమ దేశంలో ఉన్న వేలాది మంది భారతీయులను 'రోడ్లపైకి మీదకి విసిరివేస్తాం' అని నైజీరియా రాయబార అధికారి హెచ్చరించారు.

గోవాలో అద్దె గృహాల్లో ఉంటున్న నైజీరియా దేశస్థులను ఖాళీ చేయించడం ఆపకపోతే.. తమ దేశంలో ఉన్న వేలాది మంది భారతీయులను 'రోడ్లపైకి  విసిరివేస్తాం' అని నైజీరియా రాయబార అధికారి హెచ్చరించారు. 
 
అక్రమంగా ఖాళీ చేయించే ప్రక్రియను సోమవారం 9 గంటల లోపు గోవా ప్రభుత్వం ఆపివేయాలని రాయబార కార్యాలయ అధికారి జకోబ్ నదాదియా హెచ్చరికలు చేశారు. గోవాలోని నైజీరియా కమ్యూనిటిని కలుసుకున్న తర్వాత మీడియాతో జాకోబ్ మాట్లాడుతూ.. భారత దేశంలో 50 వేల నైజీరియా దేశస్థులు నివసిస్తూ ఉన్నారని.. అదేవిధంగా నైజీరియాలో పది లక్షల మంది భారతీయులు జీవిస్తున్నారు అని అన్నారు. ఒకవేళ గోవాలో అక్రమ తరలింపును ప్రభుత్వం ఆపకపోతే వారందర్ని రోడ్లపైకి విసిరివేస్తాం అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. 
 
ఇటీవల 200 మందికి పైగా నైజిరియన్ల వర్గం, పోలీసులు, స్థానికుల మధ్య  ఘర్షణ జరగడంతో గోవాలోని విదేశీయులందర్ని ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ నేపథ్యంలో నైజిరియా రాయబార అధికారి చేసిన వ్యాఖ్యలు చేయడం వివాదాన్ని మరింత ఆజ్యం పోసినట్లు కనిపిస్తోంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement