ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన 2వ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 4.6 శాతంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది.
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన 2వ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 4.6 శాతంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. సోమవారం ఈ విషయాన్ని తెలిపింది. జూన్‌తో ముగిసిన తొలి క్వార్టర్‌లో ఈ రేటు 4.4 శాతం. తన అంచనా ప్రకారం క్యూ2లో వృద్ధి స్వల్ప మెరుగుదలకు పారిశ్రామిక, ఎగుమతుల రంగంలో చోటుచేసుకున్న రికవరీనే కారణమని ఇక్రా అభిప్రాయపడింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 4.7-4.9 శాతం శ్రేణిలో ఉంటుందన్నది ఇక్రా అంచనా.