హెచ్‌టీసీ మరో కొత్త ఫోన్ విడుదల | HTC Desire 10 Lifestyle Launched in India: Price, Release Date, Specifications, and More | Sakshi
Sakshi News home page

హెచ్‌టీసీ మరో కొత్త ఫోన్ విడుదల

Sep 29 2016 8:31 PM | Updated on Sep 4 2017 3:31 PM

హెచ్‌టీసీ మరో కొత్త ఫోన్ విడుదల

హెచ్‌టీసీ మరో కొత్త ఫోన్ విడుదల

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ మేకర్ హెచ్‌టీసీ మరో కొత్త స్మార్ట ఫోన్‌ను లాంచ్ చేసింది.'హెచ్‌టీసీ డిజైర్‌ 10 లైఫ్‌స్టైల్‌ ' ఫోన్‌ ధరను రూ.15,990గా కంపెనీ నిర్ణయించింది.

న్యూఢిల్లీ:  ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌  మేకర్ హెచ్‌టీసీ భారత మార్కెట్లో తన జోరును కొనసాగిస్తోంది. ఇటీవలే 10 ప్రోను లాంచ్ చేసిన కంపెనీ తాజాగా  మరో కొత్త స్మార్ట ఫోన్‌ను లాంచ్ చేసింది.'హెచ్‌టీసీ డిజైర్‌ 10 లైఫ్‌స్టైల్‌ ' పేరుతో భారత మార్కెట్లో విడుదల చేసిన ఈ ఫోన్‌ ధరను రూ.15,990గా కంపెనీ నిర్ణయించింది. ప్రత్యేకంగా అమెజాన్‌ ఇండియా, హెచ్‌టీసీకి చెందిన ఈ-స్టోర్‌ ద్వారా అందుబాటులో   ఉంచినట్టు పేర్కొంది.  భారత మార్కట్లలో స్టోన్‌ బ్లాక్‌, పోలార్‌ వైట్‌ రంగుల్లో డిజైర్‌ 10 లైఫ్‌స్టైల్‌ లభ్యం కానుండగా ఇతర మార్కెట్లలో రాయల్ బ్లూ, వాలంటైన్ లక్స్ రంగుల్లో  లాంచ్ చేసినట్టు తెలిపింది.

హెచ్‌టీసీ డిజైర్‌ 10 లైఫ్‌స్టైల్‌ ఫీచర్లు
5.5 ఇంచెస్  స్క్రీన్
1.6 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌, 720x1280 ఎంపీ రిజల్యూషన్
 2జీబీ ర్యామ్‌, 16జీబీ అంతర్గత మెమొరీ
13ఎంపీ వెనుక కెమెరా
5ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
ఆండ్రాయిడ్‌ 6.0
2700 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement
 
Advertisement
Advertisement