ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఊరట | High Court quash mlas disqualification plea | Sakshi
Sakshi News home page

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఊరట

Sep 28 2015 11:07 AM | Updated on Mar 22 2019 6:17 PM

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఊరట - Sakshi

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఊరట

వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు ఉమ్మడి హైకోర్టులో ఊరట లభించింది.

హైదరాబాద్: వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు ఉమ్మడి హైకోర్టులో ఊరట లభించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉన్నందున జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. స్పీకర్ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. స్పీకర్ కు ఆదేశాలివ్వలేమని స్పష్టం చేసింది.

కాగా, హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు చెప్పారు. ఈ అంశం కోర్టులో ఉన్నందున మాట్లాడలేనని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement