
పాపగారికి మెగాహీరో వెరైటీ విషెస్!
ఒక నటి పుట్టినరోజు కంటే ఆమెకు వచ్చిన విషెస్ గురించే అందరూ ఎక్కువగా మాట్లాడకుంటే ఎలా ఉంటుంది.
ఒక నటి పుట్టినరోజు కంటే ఆమెకు వచ్చిన విషెస్ గురించే అందరూ ఎక్కువగా మాట్లాడకుంటే ఎలా ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ కథానాయిక రెజీనా కసాండ్రా అదే పరిస్థితి ఎదుర్కొంటున్నది. ఈ అందాల ముద్దుగుమ్మ పుట్టినరోజు ఈ రోజు (మంగళవారం). ఈ అమ్మడికి సాటి కథానాయికలు సమంత, రకుల్ ప్రీత్ తదితరులు ట్విట్టర్‌లో విషెస్ చెప్పారు. అభిమానులు కూడా శుభాకాంక్షలతో ముంచెత్తారు. అయితే, అందరిలోనూ మెగాహీరో సాయిధరమ్ తేజ్ బర్త్‌డే విషెస్ వెరైటీగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాయి, రెజీనా 'పిల్లా నువ్వులేని జీవితం', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రాల్లో నటించి హిట్‌పెయిర్‌గా నిలిచారు.
పాపగారికి బర్త్‌డే విషెస్ అంటూ 'సుబ్రహ్మణ్య ఫర్ సేల్'లోని స్పూప్ ఫొటోను సాయి ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. 'హ్యాపీ బర్త్ డే పాపగారు అని సాయి అంటే.. నాకు చెప్పరా? కెమెరాకి కాదని రెజీనా అంటుంది. దీంతో రెజీనాను దగ్గరగా చూస్తూ సాయి మళ్లీ విషెస్ చెప్తాడు. దానికి 'సీతతో అంత వీజీ కాదు' అంటూ తోసిపారేస్తుంది. అన్నట్టు 'సుబ్రహ్మణ్య ఫర్ సేల్'లో సీతతో వీజీ కాదు అన్న పంచ్ డైలాగ్‌ను రెజీనా వాడిన సంగతి గుర్తుంది కదా!
Happy birthday papa Garu!!! 🎂🎉🎊🎉🎊🎁🎈 pic.twitter.com/PElQsT6VTA
— Sai Dharam Tej (@IamSaiDharamTej) 13 December 2016