
ఉపాసన కలిసిన హ్యాపియ్యస్ట్ అండ్ స్వీటెస్ట్ సోల్?
పుట్టినరోజు జరుపుకుంటున్న టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నాకు ప్రముఖ హీరోభార్య అందంగా శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: పుట్టినరోజు జరుపుకుంటున్న టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నాకు ప్రముఖ హీరోభార్య అందంగా శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని ట్విట్టర్ ద్వారా ‘అవంతిక’కు పుట్టిన రోజు సందర్భంగా అభినందనలు తెలియజేశారు. తాను కలుసుకున్న మంచి మనసున్న మనుషుల్లో ఆమె కూడా ఒకరని పేర్కొన్నారు. 'హేపీయ్యస్ట్ అండ్ స్వీటెస్ట్ సోల్స్ ' అంటూ ట్వీట్ చేశారు. దీంతోపాటూ ఒక మిక్కీ మౌస్ తో తమన్నా ఫోటోనుకూడా పోస్ట్ చేసారు ఉపాసన.
కాగా మహా రాష్ట్ర లో సింది కుటుంబం లో జన్మించిన తమన్నా సినీ కరియర్ లో ఎన్నో మైలురాళ్లు ఉన్నప్పటికీ బాహుబలి సినిమా విజయంతో గ్లామర్ తారగా మరో మెట్టు అధిగమించింది. అంది వచ్చిన అవకాశాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్...
Happy birthday to one of the happiest & sweetest souls I've ever met.