'హైయన్'తో ఫిలిప్పీన్స్ అతలాకుతలం: 100 మంది మృతి | Haiyan typhoon kills at least 100 in Philippines | Sakshi
Sakshi News home page

'హైయన్'తో ఫిలిప్పీన్స్ అతలాకుతలం: 100 మంది మృతి

Nov 9 2013 9:41 AM | Updated on Sep 2 2017 12:28 AM

ఫిలిప్పీన్స్ దేశాన్ని హైయన్ తుఫాన్ అతలాకుతలం చేసింది. ఆ తుపాన్ తాకిడికి మధ్య ఫిలీప్పీన్స్లోని లెటి ప్రావెన్స్లో వందమందికిపైగా మృతి చెందారు.

ఫిలిప్పీన్స్ దేశాన్ని హైయన్ తుఫాన్ అతలాకుతలం చేసింది. ఆ తుపాన్ తాకిడికి మధ్య ఫిలీప్పీన్స్లోని లెటి ప్రావెన్స్ మృతుల దిబ్బగా మారిందని సివిల్ ఎవియేషన్ అథారటీ ఆఫ్ ద ఫిలిప్పీన్స్ (సీఏఏపీ) ఉప సంచాలకుడు జాన్ అండ్రూస్ శనివారం మనీలాలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

 

లెటి ప్రావెన్స్లో వంద మందికిపైగా మరణించారని తెలిపారు. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. అలాగే మరో వంద మంది గాయాలపాలైయ్యారని చెప్పారు. వారిని ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. హైయన్ తుఫాన్తో దేశంలో సమాచార వ్యవస్థ, రవాణ వ్యవస్థ స్థంభించిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement