'హైయన్'తో ఫిలిప్పీన్స్ అతలాకుతలం: 100 మంది మృతి
ఫిలిప్పీన్స్ దేశాన్ని హైయన్ తుఫాన్ అతలాకుతలం చేసింది. ఆ తుపాన్ తాకిడికి మధ్య ఫిలీప్పీన్స్‌లోని లెటి ప్రావెన్స్ మృతుల దిబ్బగా మారిందని సివిల్ ఎవియేషన్ అథారటీ ఆఫ్ ద ఫిలిప్పీన్స్ (సీఏఏపీ) ఉప సంచాలకుడు జాన్ అండ్రూస్ శనివారం మనీలాలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
లెటి ప్రావెన్స్లో వంద మందికిపైగా మరణించారని తెలిపారు. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. అలాగే మరో వంద మంది గాయాలపాలైయ్యారని చెప్పారు. వారిని ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. హైయన్ తుఫాన్‌తో దేశంలో సమాచార వ్యవస్థ, రవాణ వ్యవస్థ స్థంభించిందని తెలిపారు.