ప్రారంభమైన జీవోఎం సమావేశం | Group of Ministers finalises draft Telangana bill | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన జీవోఎం సమావేశం

Feb 4 2014 2:33 PM | Updated on Aug 18 2018 4:13 PM

తెలంగాణ బిల్లుపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం)మంగళవారం సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లుపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం)మంగళశారం సమావేశమయ్యారు. తెలంగాణ ముసాయిదా బిల్లులపై అసెంబ్లీ పంపిన అభిప్రాయాలు,సవరణలను జీవోఎం ఈ సందర్భంగా పరిశీలించనుంది. అసెంబ్లీలో కోరిన, ఇటు విపక్షాలు సూచించిన సవరణల్లో ప్రధానంగా పోలవరం, కొత్త రాజధానికి ఆర్థిక ప్యాకేజివంటి అంశాలను తిరిగి బిల్లులో ప్రవేశపెట్టేందుకు జీవోఎం చర్చించనుంది.

సవరణలు చేసి తుది బిల్లును జీవోఎం సిద్ధం చేయనుంది. ఈ కమిటీ చేసిన సిఫార్సులకు అనుగుణంగా తిరిగి కేబినెట్  బిల్లును రాష్ట్రపతికి పంపే అవకాశం ఉంది.  ఈ సమావేశానికి సుశీల్ కుమార్ షిండే, నారాయణ స్వామి, ఆంటోనీ హాజరయ్యారు. కాగా సమావేశం జరిగే హోంశాఖ కార్యాలయానికి కేంద్రమంత్రి పురందేశ్వరి, కిల్లి కృపారాణి వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement