ఆంబోతును హడలెత్తించిన మేక | goat fights with he cow, sends it back | Sakshi
Sakshi News home page

ఆంబోతును హడలెత్తించిన మేక

Jul 9 2015 8:23 PM | Updated on Oct 2 2018 6:48 PM

ఆంబోతును హడలెత్తించిన మేక - Sakshi

ఆంబోతును హడలెత్తించిన మేక

సింహంతో చిట్టెలుక పోరాడితే ఎలా ఉంటుంది? కొండను పొట్టేలు ఢీకొంటే ఎలా అనిపిస్తుంది? అచ్చం అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

సింహంతో చిట్టెలుక పోరాడితే ఎలా ఉంటుంది? కొండను పొట్టేలు ఢీకొంటే ఎలా అనిపిస్తుంది? అచ్చం అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒక మేక.. ఆంబోతుతో పోరాటానికి దిగింది. ఒక దశలో ఆంబోతును కూడా వెనక్కి నెట్టేస్తూ తాను ముందుకు సాగింది. ఆంబోతు శరీర పరిమాణంతో పోలిస్తే పదోవంతో.. 20వ వంతో కూడా లేని మేక.. అంత పెద్ద శత్రువును ఎలా ఎదుర్కొంటుందన్నది ఆశ్చర్యకరమే. ఎవరో ఔత్సాహికులు ఈ దృశ్యాన్ని వీడియో తీశారు. వాట్సప్లో షేర్ చేశారు.

చివరకు ఎవరో వెనక నుంచి ఈ రెండింటినీ అదిలిస్తే తప్ప మేక వెనక్కి తగ్గలేదు. పోరాటం మధ్యలో ఆంబోతు మేకను అవతలకు విసిరేసినా.. అది పోరాట పటిమను ఏమాత్రం వదలకుండా వెంటనే మళ్లీ తన చిన్ని చిన్ని కొమ్ములు విసిరింది. ప్రాణాలు పోతాయనుకున్నప్పుడు చిట్ట చివరి నిమిషం వరకు పోరాటం వదలకూడదన్న స్ఫూర్తి ఈ మేకలో కనిపిస్తోంది కదూ.. మీరూ చూడండి మరి!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement