థానేలో కుప్పకూలిన నాలుగంతస్థుల భవనం | Four storey building collapses in Thane | Sakshi
Sakshi News home page

థానేలో కుప్పకూలిన నాలుగంతస్థుల భవనం

Sep 21 2013 9:36 AM | Updated on Sep 1 2017 10:55 PM

థానే నగరంలోని ముంబ్రాలో ఈ రోజు తెల్లవారుజామున నాలుగంతస్థుల భవనం పేకమేడలా కుప్పకూలింది.

థానే నగరంలోని ముంబ్రాలో ఈ రోజు తెల్లవారుజామున నాలుగంతస్థుల భవనం పేకమేడలా కుప్పకూలింది. ఆ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులతోపాటు నగరపాలక ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహయచర్యలను ముమ్మరం చేశారు.

 

కాగా భవనం కూలిన ఘటనలో ఎంత మంది మరణించారు, ఎంత మంది గాయపడ్డారు అనేది తెలియాల్సి ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆ భవనం యజమానిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆ ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నట్లు ఉన్నతాధికారులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement