కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద ఆత్మాహుతి దాడి | four Killed in Bomb Attack Near Kabul Airport | Sakshi
Sakshi News home page

కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద ఆత్మాహుతి దాడి

Jul 22 2014 10:46 AM | Updated on Nov 6 2018 8:35 PM

ఆఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద తాలిబన్ తీవ్రవాది మంగళవారం ఆత్మాహుతి దాడికి తెగబడ్డాడు.

కాబూల్: ఆఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద తాలిబన్ తీవ్రవాది మంగళవారం ఆత్మాహుతి దాడికి తెగబడ్డాడు. ఆ ఘటనలో నలుగురు విదేశీయులతోపాటు15 మంది సైనికులు మరణించారని పోలీసులు మంగళవారం ఇక్కడ వెల్లడించారు. ఈ ఏడాది కాబుల్ విమానాశ్రయమే లక్ష్యంగా తాలిబాన్ తీవ్రవాదులు దాడులకు తెగబడుతున్నారని పోలీసులు ఈ సందర్బంగా గుర్తు చేశారు.

అయితే ఇటీవల కాలంలో తీవ్రవాదులు దాడి చేసి ఘటనల్లో ఇది అత్యంత హేయమనదని వారు అభివర్ణించారు. మంగళవారం విమానాశ్రయంపై దాడి తమ పనేనంటూ తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిత్ ప్రకటించారు. అయితే ఆత్మాహుతి దాడిలో విమానాశ్రయం వద్ద ఉన్న వాహనాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement