పోస్కో ప్రాజెక్ట్‌కు ‘గ్రీన్’ సిగ్నల్ | Environment Ministry clears POSCO project in Odisha | Sakshi
Sakshi News home page

పోస్కో ప్రాజెక్ట్‌కు ‘గ్రీన్’ సిగ్నల్

Jan 11 2014 1:08 AM | Updated on Oct 22 2018 7:26 PM

పోస్కో ప్రాజెక్ట్‌కు ‘గ్రీన్’ సిగ్నల్ - Sakshi

పోస్కో ప్రాజెక్ట్‌కు ‘గ్రీన్’ సిగ్నల్

దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీ ఒడిశాలో రూ.52 వేల కోట్లతో నిర్మిస్తోన్న ఉక్కు ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి లభించింది.

 పోస్కో:  దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీ ఒడిశాలో రూ.52 వేల కోట్లతో నిర్మిస్తోన్న ఉక్కు ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి లభించింది. అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు ఎనిమిదేళ్ల తర్వాత అనుమతి లభించింది. సామాజిక బాధ్యత కింద పోస్కో కంపెనీ 60 కోట్ల డాలర్ల కార్యక్రమాలు(ఈ ప్రాజెక్ట్ మొత్తం పెట్టుబడుల్లో 5%) చేపట్టాల్సి ఉంటుందన్న షరతుతో పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్ జియన్ వారం రోజుల్లో భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ అనుమతి లభించింది. పోస్కో కంపెనీ 12 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పాదక సామర్థ్యంతో జగత్సింగ్‌పూర్‌లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. పోస్కో ఈ ప్రాజెక్ట్‌లో  స్టీల్ ప్లాంట్, పోర్ట్ ప్రాజెక్ట్‌లను చేపట్టింది. ప్రభుత్వం దీనిని స్టీల్ ప్లాంట్, పోర్ట్ ప్రాజెక్ట్‌లుగా విడగొట్టి స్టీల్ ప్లాంట్‌కు మాత్రమే పర్యావరణ అనుమతులిచ్చింది. కాగా స్టీల్ ప్లాంట్ తొలి దశ నిర్మాణం 2018కల్లా పూర్తవుతుందని అంచనా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement