ఇలారా.. నీ నవ్వు బావుంది! | Did Donald Trump flirt with Irish reporter Caitriona Perry during diplomatic phone call? | Sakshi
Sakshi News home page

ఇలారా.. నీ నవ్వు బావుంది!

Jun 29 2017 1:01 AM | Updated on Aug 25 2018 7:52 PM

ఇలారా.. నీ నవ్వు బావుంది! - Sakshi

ఇలారా.. నీ నవ్వు బావుంది!

వింత చేష్టలు, అర్థంకాని హావభావాలకు పెట్టింది పేరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బారిన ఈసారి ఓ ఐర్లాండ్‌ మహిళా జర్నలిస్టు పడ్డారు.

ఐర్లాండ్‌ పాత్రికేయురాలితో ట్రంప్‌
వాషింగ్టన్‌: వింత చేష్టలు, అర్థంకాని హావభావాలకు పెట్టింది పేరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బారిన ఈసారి ఓ ఐర్లాండ్‌ మహిళా జర్నలిస్టు పడ్డారు. ఆయన ఓపక్క ముఖ్యమైన ఫోన్‌కాల్‌లో మాట్లాడుతూ.. మరోపక్క అందరిముందూ ఆమెను ‘ఇలారా..’ అంటూ దగ్గరికి పిలిపించుకుని ‘నీ నవ్వు సూపర్‌’ అని అతిగా ప్రవర్తించారు. మంగళవారం వైట్‌హౌస్‌లోని ఓవల్‌ ఆఫీసులో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఐర్లాండ్‌కు ప్రధానిగా ఎన్నికైన భారత సంతతి నేత లియో వారాడ్కర్‌ను ట్రంప్‌ ఫోన్‌ చేసి అభినందించారు. మాటల మధ్యలో..‘మీ దేశ మీడియా అంతా ఇక్కడే ఉంది’ అని అన్నారు.

 అలా మాట్లాడుతూనే అక్కడున్న కైత్రియోనా పెర్రీ అనే మహిళా జర్నలిస్టును దగ్గరికి పిలిచారు. ‘ఎక్కణ్నుంచి వచ్చావు? ఇలారా.. ఇలారా..! ఆమె నవ్వు ఎంతో బావుంది. ఆమె మిమ్మల్ని బాగా చూసుకుంటుంది’ అని అటువైపు ఫోన్‌లో ఉన్న వారాడ్కర్‌తో చమత్కరించారు. దీంతో పెర్రీ బిక్కచచ్చిపోయింది. తర్వాత ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ ఇదెక్కడి విడ్డూరమని వాపోయింది! ఓ దేశ నాయకుడితో మాట్లాడేటప్పుడు హుందాగా ఉండకుండా అమ్మాయిలతో ఈ పరాచికాలేంటని నెటిజన్లు ట్రంప్‌ను దులిపేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement