'3డీ'తో ప్రపంచం చూపు భారత్ వైపు | Demography, democracy and demand are drawing the world to India, says Modi | Sakshi
Sakshi News home page

'3డీ'తో ప్రపంచం చూపు భారత్ వైపు

Apr 13 2015 3:57 PM | Updated on Aug 15 2018 2:20 PM

'3డీ'తో ప్రపంచం చూపు భారత్ వైపు - Sakshi

'3డీ'తో ప్రపంచం చూపు భారత్ వైపు

డెమోగ్రఫీ, డెమొక్రసీ, డిమాండ్(3డీ) ఈ మూడు అంశాలు ప్రపంచం భారత్ వైపు చూసేలా చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

హన్నోవర్: డెమోగ్రఫీ, డెమొక్రసీ, డిమాండ్(3డీ)  ఈ మూడు అంశాలు ప్రపంచం భారత్ వైపు చూసేలా చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమ దేశంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పెట్టుబడులు పెట్టాలని విదేశీ ఇన్వెస్టర్లను కోరారు. జర్మనీ హన్నోవర్లో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... సంక్లిష్టంగా ఉన్న పన్నుల విధానాన్ని ఎత్తివేశామని వెల్లడించారు. పన్నుల విధానాన్ని సరళీకరిస్తామని తమ ప్రభుత్వ మొదటి బడ్జెట్ లోనే పేర్కొన్నామని తెలిపారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే పాత భావనలను అవసరమైతే వదులుకునేందుకు వెనుకాడబోమని మోదీ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement