'మాఫియా డాన్ ఎక్కడున్నాడో తెలియదు' | Dawood Ibrahim's location is not known: Govt | Sakshi
Sakshi News home page

'మాఫియా డాన్ ఎక్కడున్నాడో తెలియదు'

May 5 2015 2:59 PM | Updated on Sep 3 2017 1:29 AM

దావూద్ ఇబ్రహీం(ఫైల్)

దావూద్ ఇబ్రహీం(ఫైల్)

మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఎక్కడవున్నాడో తెలియదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

న్యూఢిల్లీ:  మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఎక్కడవున్నాడో తెలియదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దావూద్ ఎక్కడ ఉన్నాడో తెలిస్తే అప్పుడు అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తామని లోక్ సభకు తెలిపింది. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్ నిందితుడిగా ఉన్నాడని, అతడికి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీచేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ పరాతిభాయ్ చౌదరి లోక్ సభలో తెలిపారు. 

ఐక్యరాజ్య సమితి భద్రతా సమితి కూడా దావూద్ కు వ్యతిరేకంగా ప్రత్యేక నోటీసు జారీ చేసిందని వెల్లడించారు. ఇప్పటివరకు అతడి జాడ కనుగొనలేదని స్పష్టం చేశారు. దావూద్ ఇబ్రహీం ఆచూకీపై అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement