తగ్గిన కోరమాండల్ నికర లాభం | Coromandel International September quarter net profit declines 32% | Sakshi
Sakshi News home page

తగ్గిన కోరమాండల్ నికర లాభం

Oct 23 2013 1:58 AM | Updated on Sep 1 2017 11:52 PM

ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే తగ్గింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే తగ్గింది. నికర లాభం రూ.238 కోట్ల నుంచి రూ.164.5 కోట్లకు పడిపోయింది. ఆదాయం 20 శాతం పెరిగి రూ. 2,675 కోట్ల నుంచి రూ.3,215 కోట్లకు చేరింది. ఎరువుల సబ్సిడీ అందక పోవడం, వ్యయాలు తగ్గకపోవడం, రూపాయి పతనం తదితర కారణాల వల్లే లాభంపై ప్రభావం పడిందని కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎండీ కపిల్ మెహన్ తెలిపారు. సీఎఫ్‌వో ఎస్.సుబ్రమణియన్‌తో కలిసి ఆయన మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు.
 
 దహెజ్ వద్ద మరో యూనిట్? : కోరమాండల్ అనుబంధ కంపెనీ అయిన సబేరో ఆర్గానిక్స్‌కు గుజరాత్‌లోని దహెజ్ వద్ద ప్లాంటు ఉంది. పంట రక్షణ ఉత్పత్తులను ప్లాంటులో తయారు చేస్తున్నారు. ఇక్కడ మరో యూనిట్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని కంపెనీ పరిశీలిస్తోంది. కాగా, ఖరీఫ్ పంట దిగుబడి గణనీయంగా ఉండబోతోందని కపిల్ మెహన్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement