న్యాయవాది మోసం చేశాడంటూ కానిస్టేబుల్ ఫిర్యాదు | Constable to complaint cheating of lawyer | Sakshi
Sakshi News home page

న్యాయవాది మోసం చేశాడంటూ కానిస్టేబుల్ ఫిర్యాదు

Aug 19 2015 6:33 PM | Updated on Mar 19 2019 5:52 PM

వెంటనే బెయిల్ ఇప్పిస్తానని ఓ న్యాయవాది మోసం చేశాడని ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బంజారాహిల్స్ (హైదరాబాద్): వెంటనే బెయిల్ ఇప్పిస్తానని ఓ న్యాయవాది మోసం చేశాడని ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రెండు నెలల క్రితం అరుదైన రంగురాయి విక్రయం కేసులో నగరానికి చెందిన కానిస్టేబుల్ రాజుతోపాటు మరో నలుగురు కానిస్టేబుళ్లు అరెస్ట్ అయ్యారు. ఓయూ పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.

శ్రీనగర్‌కాలనీ గణపతి కాంప్లెక్స్ పమీపంలో నివసించే ఓ న్యాయవాది వీరికి తెల్లవారే బెయిలు ఇప్పిస్తానని రూ.20 వేలు అడ్వాన్స్‌గా తీసుకొన్నాడు. వారం దాటినా బెయిలు రాకపోవడంతో నిందితులు మరో న్యాయవాది సాయంతో బెయిలు పొందారు. తమను మోసగించిన న్యాయవాదిపై కేసు నమోదు చేయాలని కోరుతూ బుధవారం బంజారాహిల్స్ పోలీసులను ఓ కానిస్టేబుల్ ఆశ్రయించాడు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement