చాక్లెట్లతో గుండె జబ్బులు దూరం | Chocolates from heart disease | Sakshi
Sakshi News home page

చాక్లెట్లతో గుండె జబ్బులు దూరం

Jun 17 2015 7:18 AM | Updated on Sep 3 2017 3:53 AM

చాక్లెట్లతో గుండె జబ్బులు దూరం

చాక్లెట్లతో గుండె జబ్బులు దూరం

రోజుకు వంద గ్రాముల మిల్క్ చాక్లెట్ లేదా డార్క్ చాక్లెట్ తింటే చాలు.

లండన్: రోజుకు వంద గ్రాముల మిల్క్ చాక్లెట్ లేదా డార్క్ చాక్లెట్ తింటే చాలు. గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే ముప్పు తగ్గుతుందని పరిశోధకులు అంటున్నారు. చాక్లెట్ తినేవారికి గుండె సమస్యలు వచ్చే అవకాశం 11 శాతం తక్కువగా ఉంటుందని, ఈ జబ్బుల ద్వారా మరణించే అవకాశం 25 శాతం తగ్గుతుందని వారి అధ్యయనంలో తేలింది. చాక్లెట్‌కు, గుండె సమస్యలకు ఉన్న సంబంధాన్ని కనుగొనేందుకు స్కాట్లాండ్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అబిర్డీన్ పరిశోధకులు అధ్యయనం చేశారు. 21వేల మందిని పన్నెండేళ్ల పాటు అధ్యయనం జరిపి ఈ ఫలితాలు వెల్లడించారు. రోజుకు వంద గ్రామ్‌ల వరకు డార్క్, మిల్క్ చాక్లెట్లు తిన్నవారికి హృదయ సంబంధిత సమస్యలొచ్చే అవకాశం తగ్గినట్లు గుర్తించారు. చాక్లెట్లు ఆరోగ్యానికి అంత మంచివి కావనే విషయానికి విరుద్ధంగా తమ అధ్యయన ఫలితాలున్నాయని వారు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement