గాల్లో విమానం..పగిలిన కాక్ పిట్ అద్దాలు | China Southern Airlines flight CZ3483 was battled by hail storm in midair | Sakshi
Sakshi News home page

గాల్లో విమానం..పగిలిన కాక్ పిట్ అద్దాలు

Jul 10 2016 6:53 PM | Updated on Sep 4 2017 4:33 AM

గాల్లో విమానం..పగిలిన కాక్ పిట్ అద్దాలు

గాల్లో విమానం..పగిలిన కాక్ పిట్ అద్దాలు

చైనా సౌతర్న్ ఎయిర్స్లైన్స్కు చెందిన ఓ విమానం భారీ ప్రమాదం నుంచి బయటపడింది.

చెంగ్డు: చైనా సౌతర్న్ ఎయిర్స్లైన్స్కు చెందిన ఓ విమానం భారీ ప్రమాదం నుంచి బయటపడింది. హాంకాంగ్లోని గ్వాంజోహు నుంచి బయలు దేరిన సీజెడ్ 3483 విమానం గాల్లో ఉండగానే ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురవడంతో విమానం కుదుపుకు గురైంది. వడగాళ్లదాటికి విమానం ముందు భాగంతో సహా కాక్ పిట్ అద్దాలకు బీటలు వారాయి.

పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో విమానం చైనాలోని చెంగ్డు విమానశ్రయంలో సేఫ్గా ల్యాండ్ అయింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్టు చైనా సౌతర్న్ ఎయిర్లైన్స్ వెల్లడించింది.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement