నేడు వాషింగ్టన్‌కు చిదంబరం | Chidambaram to woo FIIs, hedge funds in the US | Sakshi
Sakshi News home page

నేడు వాషింగ్టన్‌కు చిదంబరం

Oct 8 2013 1:43 AM | Updated on Sep 1 2017 11:26 PM

కేంద్ర ఆర్థికమంత్రి పీ చిదంబరం మంగళవారం వాషింగ్టన్ బయలుదేరి వెళుతున్నారు.

 న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి పీ చిదంబరం మంగళవారం వాషింగ్టన్ బయలుదేరి వెళుతున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ, ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశాల్లో పాల్గొనడం ఈ అమెరికా పర్యటన ప్రధాన ఉద్దేశం. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, కోటా సంస్కరణల వంటి అంశాలపై ఈ సమావేశాలు చర్చించనున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ 16న చిదంబరం భారత్‌కు తిరిగి వస్తారు. 11వ తేదీ నుంచీ 13వ తేదీ వరకూ మూడు రోజుల పాటు జరిగే అగ్రస్థాయి సంస్థల వార్షిక సమావేశాల్లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మయారామ్‌సహా ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొననున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement